Monday, November 1, 2010
హాలప్పా ఇదేమి గోలప్పా..!!
సెక్సీ హీ(జీ)రోస్
హాలప్పా ఇదేమి గోలప్పా..!!
చూడడానికి రాష్ట్ర మంత్రివర్యులు కాని అయ్యవారు చేసే పానాలు మాత్రం కంత్రి పనులు.. రాష్ట్ర మంత్రిగా అందరి బాగోగులు చూడాల్సిన వాడు తన ప్రాణ స్నేహితుడి భార్యని చేరిపెందుకు ప్రయత్నించిన ఘనతని దక్కించుకున్నాడు. అయినా మినిస్టర్ హోదాలో తన కామ దాహాన్ని తీర్చుకోవాలంటే ఎన్ని దారులు లేవు..! ఫైవ్ స్టార్ హోటల్ లో ఫైర్ బ్రాండ్ లాంటి గుంటని తెచ్చుకుని తనకి గుల పోయేంత వరకు ఎంజాయ్ చేస్తే ఎవడు అడుగుతాడు.. ఆఫ్ కోర్స్.. రాజకీయ నాయకులకి ఇదేమి కొత్త కాదనుకోండి.. కాని పోయి పోయి స్నేహితుడి భార్య పై హత్యాచారం చేయాడానికి పాల్పడ్డాడంటే మంత్రి గారు మ్మాంచి రసపట్టు పట్టేవాడై ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కామం తో కళ్ళు ముసుకుపోయి ప్రవర్తించిన మంత్రి గారి పదవి ఊడిపోయినా మన సెక్సీ హీ(జీ)రోస్ లో మాత్రం చోటు దక్కించుకున్నాడు. అయినా స్నేహితుడి భార్యని చేరిపేయాలనుకున్న మంత్రి గారి ఖాతాలో ఇంకా ఇలాంటి సిత్రాలు ఎన్ని వున్నాయో ఏమో అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు కర్నాటక ప్రజలు మంత్రి పేరు చెబితేనే ఏమి హాలప్పా.. ఇదేమి గోలప్పా.. అంటూ తల బాడుకున్టున్నారంటే నమ్మండి.. ఏమండోయ్ హాలప్ప మంత్రి కాబట్టి ఫ్రెండు పెళ్ళాన్ని చేరిపెయాలని ప్రయత్నించాడు.. ఆడు చేసాడు కదాని మనం చేయకూడదే.. అయినా మనం సూపర్ హీరోస్ లం కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెల్లమనుకోండి.. వెల్లమనుకోండి.. ఏమిటి వెళ్ళం… అంతే.. కదూ..!!
వయసుతో పని ఎమునున్నది.. సరసాలాటలలో…
సెక్సీ హీ(జీ)రో’స్
వయసుతో పని ఎమునున్నది.. సరసాలాటలలో…
వయసుతో పని ఏమున్నది.. సరసాలాటలలో అంటూ ఆనందంగా పాడుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసేసాడు. ఇంతకీ ఆయన ఎవరనే కదా మీ డౌటు.. ఆయనెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మకాలి ఎ.పి. గవర్నర్ గా వెలగబెట్టాడు లెండి… ఆయనే ఎం.డి. తివారి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలంటే.. 85 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల అమ్మాయిలతో సరసాలాడుతున్నాడంటే ముసలోడు.. మాంచి విషయం ఉన్నోడే అని అనిపిస్తుంది కదూ.. సరసాలాడ్డానికి వయసుతో పని ఏమి వున్నది అనుకుంటూ సందు దొరికితే చాలు.. మందు కొడుతూ పొందు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈ ముసలి మన్మధుడు. గవర్నర్ హోదాలో ఉండి ఇలాంటి నీచమైన పనులు చేశాడంటేనే ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం అవుతుంది.. అంతే కాదండోయ్ ఈయన గారి మీద ఓ కేసు కుడా ఉండి. ఇతనే తన తండ్రి అని ఓ యువకు కోర్టులో కేసు వేసాడు. చూసారా.. 85 సంవత్సరాల వయసులోనే ఇన్ని కథలు పడుతున్న ఈయన గారు వయసులో వున్నప్పుడు ఇంకా ఎన్ని నీచమైన పనులు చేసాడో.. రాజభవన్లో ఈయన గారి రాసలీలలు భయట పడడంతో ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రమే కాదు.. యావత్భారతదేశం ఉలిక్కి పడింది. ఆ వెంటనే ఆయన్ని గవర్నర్ పదవి నుండి పీకేసింది.. అడ్డంగా దొరికిపోయిన తివారి గారు ఉసూరు మంటూ తట్ట బెడ సర్దుకుని తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. గవర్నర్ పదవి పోయినా మన సెక్సీ హీ(జీ)రో’స్ లో స్థానం దొరికిందని తెలిస్తే.. తివారి గారు ఎంత ఆనంద పడిపోతారో కదా..
SEXY HE(ZE)RO'S, ఆరడుగుల అందగాడి భాగోతం
సెక్సీ హీ(జీ)రోస్
చూడడానికి ఆరడుగుల తో ఎర్రగా, బుర్రగా వున్న యువకుడు అతను. మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ హీరోగా ఎదిగిన వాడు. అయిదు ఆరు బాలీవుడ్ సినిమాలలో హీరో గా కూడా నటించాడు.. కానీ ఏమి లాభం.. కామం తో కళ్ళు మూసుకుపోయి తన ఇంట్లో పని చేసే పనిమనిషిని రేప్ చేసాడు.. తన లోని కామ దాహాన్ని తీర్చు కున్నాడు అతనే బాలీవుడ్ హీరో షైనీ అహూజా. ఆ.. పనిమనిషే కదా బయటికి చెప్పుకోలేదులే అని అనుకున్నాడు. కాని ఆ అమ్మాయి ధైర్యంగా తనకి జరిగిన అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చెప్పుకుంది. దాంతో మన హీరో గారి పరువు బజారున పడింది.. అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న అతని కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది.. సినిమాలలో హీరో వేషాలు వేసి.. బయట మాత్రం విలన్ వేషాలు వేస్తే ఎవరయినా ఊరుకుంటారా.. కామం తో కళ్ళు మూసికుపోయిన ఈ హీరో గారు చివరికి జైలు ఊచలు కూడా లెక్కపెట్టాడు. సినిమా హీరో గా ఇతని కెరీర్ ముగిసినా ఇదిగో.. మన సెక్సీ హీ(జీ)రోస్ లో మాత్రం చోటు దక్కించుకున్నాడు.
ఇదిగో.. మరో కామానంద స్వామి…
సెక్సీ హీ(జీ)రోస్
ఈ మధ్య కాషాయ స్వాములు తమ భక్తులకి ముక్తి మార్గాన్ని ప్రసాదించడం సంగతి ఎలా వున్నా రక్తి మార్గాన్ని మాత్రం దగ్గరుండి మరీ సూచిస్తున్నారు. కామి గాని వాడు మోక్షగామి కాలేడు అన్న సూత్రాన్ని తమ భక్తులకు బాగా ప్రభోదించి సెక్స్ రాకెట్ ని యమా స్పీడ్ గా ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఇలాంటి సెక్స్ రాకెట్ నడిపించడం లో ఎంతో పరిణతి సంపాదించిన ఘనుడు.. ఇదిగో ఈ కామానంద.. కాదు.. కాదు.. భుమానంద స్వామి. ఇతగాడి అసలు పేరు శివ మురాట్ ద్వివేది. పేరు మార్చుకుని, భుమానంద బాబాగా అవతారం ఎత్తాడు. పగలేమో భక్తి ఉపన్యాసాలు.. రాత్రి అయితే చాలు.. అందమయిన అమ్మాయిలని వలలో పడేయడం, వారితో కామక్రీడలు చేయించడం ఈ స్వామి ప్రత్యేకత. ఈ స్వామి నిర్వహించే సెక్స్ రాకెట్ లో హెయిర్ హోస్ట్ లు కూడా ఉన్నారండోయ్.. బొద్దుగుమ్మలతో రతి కార్యక్రమాలు జరిపిస్తూ రోజుకు ౩ లక్షల వరకు సంపాదిస్తున్నడంటే ఈ.. భుమనందుడి కామ లీలలు ఏపాటివో అర్థం అవుతుంది కదూ. దేశ రాజధాని అయిన ఢిల్లీ లో యదేచ్చగా సెక్స్ రాకెట్ ని కొనసాగిస్తున్న భుమానందుడు చివరికి ఎలాగోలా పోలీసులకి చిక్కాడు. కాషాయం ముసుగులో అతను నిర్వహించిన సెక్స్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో ప్రస్తుతం ఊచలు లెక్క పెడుతున్నాడనుకోండి.. ఈ స్వామి కంటే ముందు వెలుగులోకి వచ్చిన నిత్యానందుడే కాస్త నయం అనిపిస్తోంది కదూ.. ఎందుకంటే కేవలం తాను మాత్రమే శృంగారంలో మునిగి తేలాడు.. కాని ఈ భూమానందుడు తన తో పాటు తన భక్తులని కూడా శృంగార పురుషులని చేసేసి.. కోట్లు గడించాడు.. మనసెక్సీ హీ(జీ)రోస్ లో ఆటోమేటిగ్గా స్థానం సంపాదించేసాడు.. హూ.. ఇప్పటికే ఇద్దరు స్వాములు సెక్సీ హీ(జీ)రోస్అయిపోయారు.. ముందు.. ముందు.. ఇంకెంత మంది స్వాములు సెక్సీ హీ(జీ)రోస్
సెక్స్ కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్
Sexy He(Ze)ro’s
అతనో పోలీసు ఆఫీసర్, అధికారం, అంగబలం పుష్కలంగా వున్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి అడ్డేముంటుంది. కామం తో కళ్ళు మూసుకుపోయాయి. అందుకే ముక్కు పచ్చలారని పద్నాలుగేళ్ళ అమ్మాయి పై అతని కన్ను పడింది. అంతే.. ఆ అమ్మాయి ని కసితీరా రేప్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు. ఒక నిండు జీవితాన్ని తన కామ క్రూరత్వానికి బలి చేసాడు. ఇంతకీ అతను ఎవరో చెప్పలేదు కదూ.. అతని పేరు రాథోడ్. హర్యానా మాజీ డి.జి.పి. ఇరవై ఏళ్ల క్రితం టీనేజ్ అమ్మాయి రుచికా గిర్హోత్ర పై అత్యాచారం జరిపి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన నయవంచకుడు. టెన్నిస్ క్రీడాకారిణి అయిన రుచికా తన ఫ్రెండ్ ఆరాధన గుప్తా తో కలిసి టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ కామాంధుడి చూపు రుచికా పై పడ్డాయి. అంతే ఆమెని మానభంగం చేసాడు. తన పరపతి ని ఉపయోగించుకుని ఇరవై సంవత్సరాలు శిక్ష నుండి తప్పించుకున్నాడు. కాని చివరికి న్యాయం గెలిచింది. ఈ కామందుడికి శిక్ష పడింది. ఇప్పుడు మన వాడు కటకటాల వెనుక ఉన్నాడు. రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడే డి.జి.పి. స్థాయి వ్యక్తి ఓ మానభంగం కేసులో జైలు కి వెళ్ళాడంటే అంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉంటుందా.. హూ.. ఇంతటి ఘన కార్యం చేసిన వాడికి సెక్సీ హీ(జీ)రోస్ లో స్థానం ఇవ్వకుంటే బావుండదు కాబట్టి.. సదరు రాథోడ్ ని సెక్సీ హీ(జీ)రోస్ జాబితాలోకి విసిరేసాం…
కామాంతకుడు
Sexy He(Ze)ro’s
హంతకుడు, కాలాంతకుడు లాంటి వారు వుంటారు కాని.. కామాంతకులు కూడా ఉంటారా.. అని మీకు డౌట్ వచ్చింది కదూ.. పూర్తిగా చదివిన తర్వాత కామాంతకులు కూడా ఉంటారని మీకే అర్థమవుతుంది. ఈ ఫోటో చూస్తున్నారు కదా.. ఇతగాడి పేరు ధనరాజ్, కామరాజ్ అని పెట్టాల్సింది.. కాని ధనరాజ్ అని పెట్టారు. వైజాగ్ లో ఇతనో చోటా లీడర్. అందమైన అమ్మాయిలని టి.వి. లోను, సినిమాలలోను చాన్స్ ఇప్పిస్తానని చెప్పి తమ ఇంటికి తీసుకురావడం వారికి మత్తుమందు ఇచ్చి, వారి వంటిమీద బట్టలు విప్పేసి కామక్రీడని కొనసాగించడం, దాన్ని మొత్తం వీడియో తీయడం, ఫోటోలు తీయడం వారు మత్తులో ఉండగానే రేప్ చేయడం, వారు స్పృహలోకి వచ్చాక ఆ వీడియో లు చూపించి వారిని లోబరుచుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడడం ఇతగాడి పని. ఇలా ఇతని వలలో పడ్డ ఆడవారు బయటికి చెప్పుకోలేక, తమలో తాము బాధని దిగమింగుకుంటున్నారు.. ఇతగాడికి తల్లి, బిడ్డ అన్న తేడా కూడా లేదు.. బయటివారినే కాకుండా సొంతతల్లి, బిడ్డలని కూడా తన కామ వాంఛలకి బలిచేయాలనుకున్నాడంటే.. ఇతగాడెంతటి కామాంతకుడో అర్థమవుతుంది కదూ.. ఇప్పటివరకూ సెక్సీ హీ(జీ)రోస్ లో స్థానం సంపాదించిన వారిలో ఇతగాడే చాలా డేంజరస్ ఫెలో అని మీకు అనిపిస్తుంది కదూ.
సరస ‘మ్మోహనుడు’
Sexy He(Ze)ro’s
సినిమా లోకం అనగానే అదొక అందమైన రంగుల ప్రపంచం అని అందరూ అనుకుంటారు.. ఆ రంగుల ప్రపంచం లో విహరించాలని కళలు కంటారు.. కాని.. దూరపు కొండలు నునుపు అన్న చందాన ఈ అందమైన రంగుల ప్రపంచములో అందవికారాలు ఎన్నో ఉంటాయని, ఆ అందవికారాల బారిన పడి తమ అందమైన బతుకులు నాశనం చేసుకుంటామని తెలియని ఎందరో అమ్మాయిలు సినిమా మోజులో పడి కొంతమంది కామందులకి బలి అవుతున్నారు. ఇలాంటి కామందులలో ప్రముఖ నటులు కూడా వుండడం దురదృష్టం. బాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న శక్తి కపూర్ లాంటి వాడు కూడా సరస మ్మోహనుడి అవతారం ఎత్తి ఓ అమ్మాయిని సినిమాలో అవకాశం ఇప్పిస్తానని, దానికి ఆ అమ్మాయి ఓ రాత్రి తనతో పడుకోవాలని నిర్లజ్జగా అడిగాడంటే ఇక మిగతా సాదా సీదా నటులు అమ్మాయిలని ఎంతలా మోసం చేయగలరో ఊహించుకుంటేనే.. అబ్బో.. సినిమా ముసుగులో ఎంత మంది అమ్మాయిలు బలి అవుతున్నారో కదా.. తెరపై నవ్వులు పండించే శక్తి కపూర్ తెరవెనుకాల సరస ‘మ్మోహనుడి’ అవతారం ఎత్తడంతో మన సెక్సీ హీ(జీ)రోస్ లో బెర్త్ ఖాయం చేసుకున్నాడు.. ఇంకా ముందు ముందు.. ఎంత మంది నటులు ఇక్కడ బెర్త్ ఖాయం చేసుకుంటారో.. ఏమో..
వికృతానంద భగవానుడు..
Sexy He(Ze)ro’s
ఏ స్వామీ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వ కారణం, సర్వదా కామ మాయం.. అన్నట్టు వున్నది నేటి స్వాముల భాగోతాలు. మొన్న నిత్యానంద.. నిన్న భూమానంద, నేడు కల్కి భగవానుడు.. పేర్లు ఏవైనా కాషాయం ముసుగులో వీరంతా చేస్తున్నది అసాంఘీక కార్య కలాపాలే.. ముఖ్యంగా ఆడవారిని నయానా, భయానా లోబరుచుకుని, వారితో కామ కార్యకలాపాలను సాగించడం, మత్తు మందు ఇచ్చి వారిని అనుభవించడం.. బయటికి చెప్పకుండా ఉండేందుకు వారి నగ్న శరీరాలని వీడియో తీసి బ్లాకు మెయిల్ చేయడం నేడు సర్వ సాధారణం అయిపొయింది. తానూ కలియుగ అవతార పురుషుడినని ప్రచారం చేసుకుని, వేల మంది భక్తులని, వేల కోట్ల ఆస్తిని సంపాదించిన కల్కి భగవానుడు.. కాషాయం ముసుగులో ఎన్నో దారుణాలు చేస్తున్నాడని తెలిసి అందరూ దిగ్బ్రాంతికి గురి అయ్యారు. అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి వారితో కామక్రీడలు ఆడుతున్నాడని తెలిసి ముక్కుమీద వేలేసుకున్నారు. తమ స్వార్థ ప్రయోజనాలకు, తమలోని వికృత కోరికలకు సామాన్య మహిళలని బలి చేస్తున్నారు. వారితో తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు.. ఇప్పటికే ఇలాంటి స్వాములు ఇద్దరూ సెక్సీ హీ(జీ)రోస్ లూ వున్నారు.. ఇదిగో ఏ కల్కి బాబా మూడో వాడు. అందరికి భగవానుడు అని చెప్పుకున్నవాడు చివరికి సెక్సీ హీ(జీ)రోస్ లో ఒకడు అయిపోయాడు.
ప్రేమ పేరుతో మోసం.. దగా.. కుట్ర..
Sexy He(Ze)ro’s
ఇతని పేరు రంగనాథ్ గౌడ్.. చేసే ఉద్యోగం ఎస్.ఐ. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేసాడు. పోలీసులు మోసం చేయడం మామూలే కదా అని అంటారా.. అదీ నిజమేననుకోండి.. కాకపోతే ఇతను చేసిన మోసం వేరే ఏ పోలీసు బహుశా చేయడేమో. ఇతగాడి చేతిలో మోస పోయిన అమ్మాయి పేరు రజియా సుల్తానా.. వయసు 18 సంవత్సరాలు.. అందంగా వుంటుంది.. పైగా అమాయకురాలులా కనిపించింది.. పోలీసు బుద్ది ఎక్కడికి పోతుంది.. ఆ అమ్మాయితో సరదాలు తీర్చేసుకుని పని అయిపోయాకా వదిలేసి చేతులు దులుపుకోవాలనుకున్నాడు. కాని.. పోలిసోడి బుద్దిని ముందే గ్రహించిందేమో.. రజియా సుల్తానా తన జాగ్రత్తలో తను ఉంది. రంగనాథ్ తనని ప్రేమించాడని చెప్పుకోవడానికి కావలసిన సాక్ష్యాలను ముందే జాగ్రత్త చేసింది..
అధికారం చేతిలో ఉండడంతో ఎప్పటికైనా తనని మోసం చేస్తాడని ఊహించిన రజియా ఊహ నిజం చేస్తూ తన పోలీసు బుద్దిని చూపించాడు రంగనాథ్.. రజియా ఊరుకుంటుందా.. తనని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అతన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది.. కోర్టును ఆశ్రయించింది.. ప్రజా సంఘాలు రజియా కి అండగా నిలిచాయి.. అయినా రంగనాథ్ మాత్రం రజియా ని పెళ్ళిచేసుకునే ప్రసక్తే లేదంటున్నాడు.. రజియా ని పెళ్లి చేసుకోవడానికి అతని అహం దెబ్బతింటుంది.. ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్ళిచేసుకుంటానని మోసం చేసినందుకు గాను ఎస్.ఐ. రంగనాథ్ సెక్సీ హీ(జీ)రోస్ లో ఒకడిగా మారిపోయాడు. అదీ సంగతి…
మాధుర్ బండారం
Sexy He(Ze)ro’s
అతను బాలీవుడ్ లో పేరు పొందిన దర్శకుడు. సూపర్ హిట్ చిత్రాలని తీసాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా మంది పేరుంది. అయన కెరీర్ లో మూడు సార్లు ఉత్తమ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు దక్కించుకున్న ఘనత కూడా అయన సొంతం. ఈయన ఎవరో కాదు.. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంటు అయిన మాధుర్ భండార్కర్. వెండితెర మీద ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించిన డైరెక్టర్ ఈ సెక్సీ హీ(జీ)రోస్ లోకి ఎందుకు వచ్చాడు అనే కదా మీ డౌటు. హు.. సినిమాలని విజయ వంతంగా తీసే టాలెంటు తో పాటు రేప్ అటెంప్ట్ చేసే టాలెంట్ కూడా వుంది మరి.
అయినా అతను ఎంజాయ్ చేయాలంటే రహస్యంగా చేసుకోవచ్చు.. టాప్ డైరెక్టర్ కాబట్టి అతనితో గడపడానికి అప్ కమింగ్ హీరోయిన్ లు రెడీ గా వుంటారని అనడంలో సందేహం లేదు.. ఈ రంగుల ప్రపంచం లో అదీ బాలీవుడ్ లో ఇలాంటివి చాలా కామన్.. బహుషా ఆ వుద్దేశం తోనే కాబోలు.. హీరోయిన్ ప్రీతీ జైన్ ని రేప్ చేయడానికి చూసాడు. కాని ఈ అమ్మడు అందరిలా నోరుమూసుకోకుండా ధైర్యంగా మాధుర్ భండార్కర్ భండారం బయటపెట్టింది.. ధైర్యంగా అతని పై పోలీసు రిపోర్ట్ ఇచ్చింది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చట్టం ముందు అందరూ సమానమే కావడంతో ఆయన్ని జైలుకి తరలించారు. కోర్టులో కేసు వేశారు.. ఆ విధంగా ఈ డైరెక్టర్ సెక్సీ హీ(జీ)రో అయిపోయి.. సెక్సీ హీ(జీ)రోస్ లో చోటు దక్కించు కున్నాడన్నమాట.. అదీ సంగతి..
మును(మృగ) శర్మ
Sexy He(Ze)ro’s
ఇతని పేరు మునుశర్మ.. కాని మృగ శర్మ అని పిలిస్తే బాగుంటుది. ఎందుకంటే అతను మనిషి రూపంలో వున్న మృగం కాబట్టి. ఇతని తండ్రి ఓ పొలిటికల్ లీడర్. ప్రజల సొమ్ముని బాగా ఆర్జించి తన కొడుకు జులాయిగా మారడానికి కావాల్సినంత డబ్బుని అడగ్గానే ఇచ్చేవాడు. ఇంకే.. డబ్బుకు డబ్బు, పలుకుబడికి పలుకుబడి.. ఏదైనా చేయగల తెగింపు. ఓ పార్టీ లో జేస్సికాలాల్ అనే ఓ అందమైన అమ్మయిపైన ఈ మ్రుగశర్మ కన్నుపడింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెని రేప్ చేసి అతి కిరాతకంగా చంపేసాడు. తానో పోలిటికల్ లీడర్ కొడుకుని, తనని ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో వున్నా.. న్యాయస్థానం ముందు దోషిగా నిలబడక తప్పలేదు. జేస్సికాలాల్ ని తన కొడుకు హత్య చేయలేదని నిరూపించడానికి ఆ పొలిటికల్ తండ్రి ఎన్నో అడ్డ దారులు తొక్కాడు. సాక్ష్యాలని తారుమారు చేయాలని చూసాడు. డబ్బుతో న్యాయాన్ని కొనాలనుకున్నాడు. కాని చివరికి అతని డబ్బు, పలుకుబడి న్యాయం ముందు తలవంచక తప్పలేదు. జేస్సికాలాల్ ని అతి కిరాతకంగా హత్య చేసినందుకు గాను పదకొండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత
ఈ మృగశర్మ కి ఉరిశిక్ష విధించింది. ఇలాంటి మృగాలకి పడాల్సిన శిక్ష నే పడింది. ఇతగాడు ఎంత కిరాతకుడైనా ఈ క్వాలిఫికేషన్ సంపాదించాడు కాబట్టి మన సెక్సీ హీ(జీ)రోస్ లో ఒకడయ్యాడు.