Monday, November 1, 2010

సరస ‘మ్మోహనుడు’


Sexy He(Ze)ro’s

సినిమా లోకం అనగానే అదొక అందమైన రంగుల ప్రపంచం అని అందరూ అనుకుంటారు.. ఆ రంగుల ప్రపంచం లో విహరించాలని కళలు కంటారు.. కాని.. దూరపు కొండలు నునుపు అన్న చందాన ఈ అందమైన రంగుల ప్రపంచములో అందవికారాలు ఎన్నో ఉంటాయని, ఆ అందవికారాల బారిన పడి తమ అందమైన బతుకులు నాశనం చేసుకుంటామని తెలియని ఎందరో అమ్మాయిలు సినిమా మోజులో పడి కొంతమంది కామందులకి బలి అవుతున్నారు. ఇలాంటి కామందులలో ప్రముఖ నటులు కూడా వుండడం దురదృష్టం. బాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న శక్తి కపూర్ లాంటి వాడు కూడా సరస మ్మోహనుడి అవతారం ఎత్తి ఓ అమ్మాయిని సినిమాలో అవకాశం ఇప్పిస్తానని, దానికి ఆ అమ్మాయి ఓ రాత్రి తనతో పడుకోవాలని నిర్లజ్జగా అడిగాడంటే ఇక మిగతా సాదా సీదా నటులు అమ్మాయిలని ఎంతలా మోసం చేయగలరో ఊహించుకుంటేనే.. అబ్బో.. సినిమా ముసుగులో ఎంత మంది అమ్మాయిలు బలి అవుతున్నారో కదా.. తెరపై నవ్వులు పండించే శక్తి కపూర్ తెరవెనుకాల సరస ‘మ్మోహనుడి’ అవతారం ఎత్తడంతో మన సెక్సీ హీ(జీ)రోస్ లో బెర్త్ ఖాయం చేసుకున్నాడు.. ఇంకా ముందు ముందు.. ఎంత మంది నటులు ఇక్కడ బెర్త్ ఖాయం చేసుకుంటారో.. ఏమో..

No comments:

Post a Comment