Sexy He(Ze)ro’s
హంతకుడు, కాలాంతకుడు లాంటి వారు వుంటారు కాని.. కామాంతకులు కూడా ఉంటారా.. అని మీకు డౌట్ వచ్చింది కదూ.. పూర్తిగా చదివిన తర్వాత కామాంతకులు కూడా ఉంటారని మీకే అర్థమవుతుంది. ఈ ఫోటో చూస్తున్నారు కదా.. ఇతగాడి పేరు ధనరాజ్, కామరాజ్ అని పెట్టాల్సింది.. కాని ధనరాజ్ అని పెట్టారు. వైజాగ్ లో ఇతనో చోటా లీడర్. అందమైన అమ్మాయిలని టి.వి. లోను, సినిమాలలోను చాన్స్ ఇప్పిస్తానని చెప్పి తమ ఇంటికి తీసుకురావడం వారికి మత్తుమందు ఇచ్చి, వారి వంటిమీద బట్టలు విప్పేసి కామక్రీడని కొనసాగించడం, దాన్ని మొత్తం వీడియో తీయడం, ఫోటోలు తీయడం వారు మత్తులో ఉండగానే రేప్ చేయడం, వారు స్పృహలోకి వచ్చాక ఆ వీడియో లు చూపించి వారిని లోబరుచుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడడం ఇతగాడి పని. ఇలా ఇతని వలలో పడ్డ ఆడవారు బయటికి చెప్పుకోలేక, తమలో తాము బాధని దిగమింగుకుంటున్నారు.. ఇతగాడికి తల్లి, బిడ్డ అన్న తేడా కూడా లేదు.. బయటివారినే కాకుండా సొంతతల్లి, బిడ్డలని కూడా తన కామ వాంఛలకి బలిచేయాలనుకున్నాడంటే.. ఇతగాడెంతటి కామాంతకుడో అర్థమవుతుంది కదూ.. ఇప్పటివరకూ సెక్సీ హీ(జీ)రోస్ లో స్థానం సంపాదించిన వారిలో ఇతగాడే చాలా డేంజరస్ ఫెలో అని మీకు అనిపిస్తుంది కదూ.
No comments:
Post a Comment