Monday, November 1, 2010

ప్రేమ పేరుతో మోసం.. దగా.. కుట్ర..


Sexy He(Ze)ro’s

ఇతని పేరు రంగనాథ్ గౌడ్.. చేసే ఉద్యోగం ఎస్.ఐ. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేసాడు. పోలీసులు మోసం చేయడం మామూలే కదా అని అంటారా.. అదీ నిజమేననుకోండి.. కాకపోతే ఇతను చేసిన మోసం వేరే ఏ పోలీసు బహుశా చేయడేమో. ఇతగాడి చేతిలో మోస పోయిన అమ్మాయి పేరు రజియా సుల్తానా.. వయసు 18 సంవత్సరాలు.. అందంగా వుంటుంది.. పైగా అమాయకురాలులా కనిపించింది.. పోలీసు బుద్ది ఎక్కడికి పోతుంది.. ఆ అమ్మాయితో సరదాలు తీర్చేసుకుని పని అయిపోయాకా వదిలేసి చేతులు దులుపుకోవాలనుకున్నాడు. కాని.. పోలిసోడి బుద్దిని ముందే గ్రహించిందేమో.. రజియా సుల్తానా తన జాగ్రత్తలో తను ఉంది. రంగనాథ్ తనని ప్రేమించాడని చెప్పుకోవడానికి కావలసిన సాక్ష్యాలను ముందే జాగ్రత్త చేసింది..

అధికారం చేతిలో ఉండడంతో ఎప్పటికైనా తనని మోసం చేస్తాడని ఊహించిన రజియా ఊహ నిజం చేస్తూ తన పోలీసు బుద్దిని చూపించాడు రంగనాథ్.. రజియా ఊరుకుంటుందా.. తనని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అతన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది.. కోర్టును ఆశ్రయించింది.. ప్రజా సంఘాలు రజియా కి అండగా నిలిచాయి.. అయినా రంగనాథ్ మాత్రం రజియా ని పెళ్ళిచేసుకునే ప్రసక్తే లేదంటున్నాడు.. రజియా ని పెళ్లి చేసుకోవడానికి అతని అహం దెబ్బతింటుంది.. ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్ళిచేసుకుంటానని మోసం చేసినందుకు గాను ఎస్.ఐ. రంగనాథ్ సెక్సీ హీ(జీ)రోస్ లో ఒకడిగా మారిపోయాడు. అదీ సంగతి…


No comments:

Post a Comment