Sexy He(Ze)ro’s
ఇతని పేరు మునుశర్మ.. కాని మృగ శర్మ అని పిలిస్తే బాగుంటుది. ఎందుకంటే అతను మనిషి రూపంలో వున్న మృగం కాబట్టి. ఇతని తండ్రి ఓ పొలిటికల్ లీడర్. ప్రజల సొమ్ముని బాగా ఆర్జించి తన కొడుకు జులాయిగా మారడానికి కావాల్సినంత డబ్బుని అడగ్గానే ఇచ్చేవాడు. ఇంకే.. డబ్బుకు డబ్బు, పలుకుబడికి పలుకుబడి.. ఏదైనా చేయగల తెగింపు. ఓ పార్టీ లో జేస్సికాలాల్ అనే ఓ అందమైన అమ్మయిపైన ఈ మ్రుగశర్మ కన్నుపడింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెని రేప్ చేసి అతి కిరాతకంగా చంపేసాడు. తానో పోలిటికల్ లీడర్ కొడుకుని, తనని ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో వున్నా.. న్యాయస్థానం ముందు దోషిగా నిలబడక తప్పలేదు. జేస్సికాలాల్ ని తన కొడుకు హత్య చేయలేదని నిరూపించడానికి ఆ పొలిటికల్ తండ్రి ఎన్నో అడ్డ దారులు తొక్కాడు. సాక్ష్యాలని తారుమారు చేయాలని చూసాడు. డబ్బుతో న్యాయాన్ని కొనాలనుకున్నాడు. కాని చివరికి అతని డబ్బు, పలుకుబడి న్యాయం ముందు తలవంచక తప్పలేదు. జేస్సికాలాల్ ని అతి కిరాతకంగా హత్య చేసినందుకు గాను పదకొండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత
ఈ మృగశర్మ కి ఉరిశిక్ష విధించింది. ఇలాంటి మృగాలకి పడాల్సిన శిక్ష నే పడింది. ఇతగాడు ఎంత కిరాతకుడైనా ఈ క్వాలిఫికేషన్ సంపాదించాడు కాబట్టి మన సెక్సీ హీ(జీ)రోస్ లో ఒకడయ్యాడు.
No comments:
Post a Comment