మన బాస్ తో
ముగ్గురు యువతులు ఒకే దగ్గర పనిచేస్తున్నారు…. ప్రతి రోజూ తమ బాస్ వెళ్ళిపోయిన గంట తరువాత వీళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. అది నచ్చని ఒక యువతి మిగతా ఇద్దరితో ఇలా చెప్పింది ”చూడండి మనం ఇవాళ బాస్ వెళ్ళగానే వెళ్ళిపోదాం…” అందుకు మిగతా ఇద్దరూ అంగీకరించి బాస్ వెళ్ళిపోయిన వెంటనే అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. మరునాడు డ్యూటీకి వచ్చిన వారందరూ ఒక చోట కలుసుకుని నిన్నటి రోజు వాళ్ళు ఏమేం చేశారు చెప్పుకోసాగారు… మొదటి యువతి ”నేను నిన్న మా ఆయనతో కలిసి ఎంచెక్కా హోటల్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేశాను” రెండో యువతి ఇలా చెప్పింది ”నిన్న ఏను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ కి వెళ్ళి అక్కడ నీళ్ళలో స్నానం చేసి సినిమాకి వెళ్ళాను….” ఆఖరి యువతి ఇలా చెప్పింది ”నేను ఇంటికి వెళ్ళి తలుపు తీసి ఉండటం చూసి లోపలి వెళ్ళాను అక్కడ నా భర్త మన బాస్ తో ఎంజాయ్ చేస్తున్నాడు మన బాస్ నన్ను ఎక్కడ చూస్తాడో అని భయపడి బయటికి పరుగుతీశాను…..
No comments:
Post a Comment