Tuesday, October 26, 2010

ఆమెని ఏమైనా


ఒక యువకుడికి జబ్బు చేసి ఇంటిదగ్గరే ఉండవలసి వచ్చింది…. అతని భార్య అతని పక్కనే ఉండి అతని కావలసినవన్నీ చేసిపెడుతూ ఉంది.
అది చూసి ఆ యువకుడు … ”ఆహా నా భార్య ఎంత మంచిది…. నేను అనారోగ్యంగా వుంటే నా దగ్గరే కూర్చుని నాకు కావలసినవన్నీ అందిస్తుంది అందుకు ఆమెని ఏమైనా కోరిక కోరుకో అని అడగాలి…” అని అనుకుని భార్యతో…”నీకు ఏం కావాలో కోరుకో నాకు ఆరోగ్యం బాగయ్యింతర్వాత కొనిస్తాను….”
అందుకు భార్య ”మీరు త్వరగా కోలుకుని ఆఫీసుకు వెళ్తే చాలు …”
భర్త : ”అది కాదు ఇంక ఏమైనా కోరుకో…”
భార్య :అబ్బా మీకు చెపితే వినపడదా మీరు ఇంట్లో వుంటే అటు పోస్ట్ మాన్ కీ, ఇటు కిరాణాకొట్టు వాడికీ ఇంట్లోకి రావడానికి కుదరడం లేదు…”

No comments:

Post a Comment