ఒక రోజు స్కూలుకి ఒక అబ్బాయి లేట్ గా వచ్చాడు అది చూసి టీచర్ ”నీవు ఎందుకు ఆలస్యంగా స్కూలుకి వచ్చావు” అని అడిగింది. దానికి ఆ అబ్బాయి ”నేను ఇంతసేపు బంగారు కొండపై ఉన్నాను అందుకే లేట్ అయ్యింది” అని చెప్పాడు. మరుసటి రోజు మరొక అబ్బాయి లేట్ గా స్కూలుకి వచ్చాడు… అది చూసి టీచర్ ఆ అబ్బాయితో ”నీకేమైంది నీవు లేట్ గా ఎందుకు వచ్చావు…?” ఆ అబ్బాయి కూడా ”టీచర్ నేను కూడా ఇంతసేపు బంగారు కొండపై ఉన్నాను అందుకే లేట్ అయ్యింది” అని చెప్పాడు. కొంత సేపటి తరువాత ఒక కొత్త అమ్మాయి క్లాస్ కి లేట్ గా వచ్చింది… టీచర్ ఆ అమ్మాయి తో ఇలా అంది… ”నీకేమైంది లేట్ గా ఎందుకు వచ్చావు…? నీవు కూడా ఇంతసేపూ బంగారుకొండపై ఉన్నావా …? ఆ అమ్మాయి ఇలా చెప్పింది ”లేదు టీచర్ … నాపేరు బంగారుకొండ…”
టీచర్ ”ఆ….???
Tuesday, October 26, 2010
బంగారు కొండపై
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment