ఒక భార్యాభర్తలకు నలుగురు కొడుకులు ఉంటారు. వారిలో ముగ్గురు అబ్బాయిలు ఎరుపు రంగు జుట్టుతో ఉంటారు… ఒక అబ్బాయి మాత్రం నలుపు రంగు జుట్టుతో ఉంటాడు…. భర్తకు ఎప్పుడూ భార్యపై అనుమానంగానే ఉంటుంది….
భర్త చనిపోయే ముందు భార్యను పిలిచి ఇలా అడిగాడు….”రాణీ ఇప్పటికైనా నిజం చెప్పు మనకు పుట్టిన నలుగురు పిల్లలూ నాకే పుట్టారు కదా…?ఎందుకంటే ముగ్గురు పిల్లలకు నా జుట్టు రంగు వచ్చింది కానీ ఆఖరి వాడికి నా జుట్టు రంగు రాలేదు”
భార్య : ”ఎంతమాట మీ మీద ఒట్టు… నలుగురు పిల్లలూ మీవల్లే పుట్టారు …”
అది విన్న తరువాత భర్త మనశ్శాంతిగా కన్ను మూసాడు…
భార్య : ”బతికిపోయాను … ఆయనకు ఆఖరి వాడి మీదనే అనుమానం కలిగింది…. మిగతా ముగ్గురు పిల్లలపై అనుమానం రాలేదు….” అనుకుంది తేలికగా ఊపిరి తీసుకుంటూ….
Tuesday, October 26, 2010
నలుగురు…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment