Tuesday, October 26, 2010

అతను నీకు ఎలా


రాజు రాత్రంతా వాలీ బాల్ ప్రాక్టీస్ చేస్తూ వుంటాడు. అతని భార్య ఇదంతా చూసి రాజుకి కాస్త రిలాక్స్ కావాలని, కొద్దిరోజులు ఆటకు దూరంగా వుంచాలని ఆలోచించి అతన్ని ఒక సాయంత్రం క్లబ్ కు తీసుకెళ్తుంది. బార్ దగ్గర డోర్ తీసే అతను రాజును చూసి ”హాయ్ రాజు…? ఏంటీ ఇక్కడకు వచ్చావు…?” అని అడిగాడు. రాజు భార్య అది చూసి అతను నీకు ఎలా పరిచయం అని అడుగుతుంది దానికి రాజు ”అతను కూడా వాలీబాల్ ప్లేయర్ అందుకే” అని అన్నాడు. వారు లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంతలో అక్కడికి వెయిట్రస్ వచ్చి ”హాయ్ రాజూ …! నీకు బ్రాందీ ఎంత కావాలి” అని అడిగింది. అది చూసి రాజు భార్య ”అయితే నువ్వు ఇక్కడకు రెగ్యులర్ గా వస్తుంటావన్నమాట…!” అని అడిగింది. దానికి రాజు ”లేదు లేదు… ఆవిడ నేను ప్రాక్టీస్ చేసే దగ్గరకు రోజూ వస్తుంటుంది.. అని చెప్పాడు. బార్ లో డాన్స్ చేసే అమ్మాయి వచ్చి ”హాయ్ రాజూ! ఈవేళ నేను ఖాళీగానే ఉన్నాను నాతొ వస్తావా…?” అని అడిగింది. అది చూసి రాజు భార్య విసురుగా లేచి బయటకు వెళ్ళిపోయింది. రాజు కూడా ఆమెని వెంబడిస్తూ వెనకాలే వెళ్ళాడు కానీ అప్పటికే ఆవిడ ఒక టాక్సీలో కూర్చుంది. రాజు కూడా బలవంతంగా అందులో దూరి కూర్చున్నాడు. డ్రైవర్ వెనక్కి తిరిగి ఇలా అన్నాడు ”రాజూ భలే లక్కీ నువ్వు రోజుకో అమ్మాయిని తీసుకుని ఎంజాయ్ చేస్తున్నావ్ మరి ఈ పిల్లని ఎక్కడ పట్టావ్…?


No comments:

Post a Comment